అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rice Mill Dues | రైస్‌మిల్లులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రైస్‌మిల్లుల బంద్ సందర్భంగా బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు.
Rice Mill Dues | పాత నిబంధనలతో ఇబ్బందులు
1969లో ఎఫ్‌సీఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్వింటాలు ధాన్యానికి రా రైస్ 67 కిలోలు, బాయిల్డ్ రైస్ 68 కిలోలు ఇవ్వాల్సి ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేవన్నారు.
వాతావరణ పరిస్థితులు రైస్‌మిల్లులకు ప్రతికూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మిల్లులకు పంపుతున్న నేపథ్యంలో నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం ఇవ్వడం కష్టంగా మారుతోందన్నారు. క్వింటాలు ధాన్యానికి ప్రస్తుతం 55 నుంచి 57 కిలోల వరకు మాత్రమే బియ్యం లభిస్తోందని వివరించారు.
Rice Mill Dues | ఫిజికల్ వెరిఫికేషన్‌తో వేధింపులు
మిల్లింగ్ ప్రక్రియలో లభించే ముడిసరకును ఇథనాల్, లిక్కర్ పరిశ్రమలకు విక్రయిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. లిక్కర్ కంపెనీలు సైతం దాదాపు 70 శాతం వరకు రైస్‌మిల్లులపై ఆధారపడి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో రైస్‌మిల్లులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మిల్లింగ్ రంగంలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను అమలు చేయాలని కోరారు.
Rice Mill Dues | బకాయిలు విడుదల చేస్తేనే మనుగడ
సీఎంఆర్ బిల్లులు రూ.వేల కోట్ల మేర పెండింగులో ఉండటంతో రైస్‌మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌మిల్లులపై వందలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, బకాయిలు చెల్లించకపోవడంతో వారి జీవనోపాధిపై ప్రభావం పడుతోందన్నారు.
Telangana ప్రభుత్వం తక్షణమే పెండింగులో ఉన్న సీఎంఆర్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం అందించేందుకు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.