Student Murder Attempt | సెలవు కోసం తోటి విద్యార్థిపై హత్యాయత్నం

బడికి సెలవులు వస్తాయని తోటి విద్యార్థిపై ఇద్దరు బాలురు హత్యాయత్నం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Student Murder Attempt | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​లోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవుల కోసం ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు హత్యాయత్నం చేశారు. వారం క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

కంభంవారిపల్లి మండలం గ్యారంపల్లె గురుకుల పాఠశాల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అదే గదిలో ఉంటున్న మరో ఇద్దరు చంపేందుకు యత్నించారు. వారం క్రితం రాత్రి హాస్టల్​లో నిద్రపోతున్న సమయంలో సదరు విద్యార్థి ముఖంపై దిండు గట్టిగా నొక్కిపట్టారు. ఊపిరాడకుండా చేసి, గొంతు నులిమి హత్య చేయాలని ప్రయత్నించారు.

Student Murder Attempt | తప్పించుకొని..

ఒక్కసారిగా తన ముఖంపై దిండు పెట్టి అదమడంతో ఆ విద్యార్థికి మెలుకువ వచ్చింది. వారితో పెనుగులాట అనంతరం తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఉపాధ్యాయులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Student Murder Attempt | సెలవులు వస్తాయని..

చివరకు ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఎంఈవో పాఠశాలలో విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థితో పాటు, హత్యాయత్నం చేసిన వారితో సైతం మాట్లాడారు. గతంలో పాఠశాలలో ఒక్కసారి అనుకోకుండా ఓ విద్యార్థి చనిపోయాడు. దీంతో కొన్ని రోజులు సెలవు ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి సెలవుల కోసం ఇద్దరు విద్యార్థులు అతడిని చంపాలని చూశారు. సెలవుల కోసం ఓ ప్రాణం తీయాలనే ఆలోచన విద్యార్థుల్లో రావడం ఆందోళన కలిగిస్తోంది. హత్యాయత్నానికి పాల్పడిన బాలురకు టీసీ ఇచ్చి పంపించారు.

ఇది కూడా చదవండి..: MLC Bharat Remarks | ఎమ్‌ఎల్‌సీ భరత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్.. చట్టాన్ని అతిక్రమిస్తే ఉక్కుపాదమే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *