Sensex Nifty Gains | నష్టాలకు బ్రేక్ .. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sensex Nifty Gains | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. అయితే భారత ఈక్విటీ మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. దీంతో మూడు రోజుల తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాట పట్టాయి.

Sensex Nifty Gains | ఫ్లాట్‌గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 22 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 168 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 312 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 48 పాయింట్లు పెరిగింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్‌తో 114 పాయిట్లు కోల్పోయింది. చివరి క్షణంలో మార్కెట్లు కోలుకుని పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 23,477 వద్ద స్థిరపడ్డాయి.

Sensex Nifty Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,926 కంపెనీలు లాభపడగా 2,409 స్టాక్స్ నష్టపోయాయి. 192 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 180 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 142 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 15 స్టాక్ లాభపడగా.. 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. పవర్‌గ్రిడ్ 2.27 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.65 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.44 శాతం, ఎన్టీపీసీ 1.13 శాతం, టెక్ మహీంద్రా 1.09 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్సీఎల్ టెక్ 2.43 శాతం, టాటా స్టీల్ 1.38 శాతం, ట్రెంట్ 1.12 శాతం, ఐటీసీ 0.84 శాతం, అదానీపోర్ట్స్ 0.79 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | అస్థిరంగా మార్కెట్లు.. ఫ్లాట్‌గా సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *