Sep 11 Market Analysis | డీప్ రెడ్‌లో గ్లోబల్ క్యూస్..నష్టాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్

గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 11 Market Analysis | పశ్చిమాసియా(East asia)లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో గ్లోబల్ మార్కెట్ల(Global markets)లో నష్టాల పరంపర కొనసాగుతోంది.

Sep 11 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

ఆగస్టు నెలకు సంబంధించిన ఉత్పత్తిదారుల ధరల డేటా మరియు పెరుగుతున్న చమురు ధరలు.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీంతోపాటు పెరుగుతున్న ట్రెజరీ ఈల్డ్స్ స్టాక్స్‌ను తక్కువ ఆకర్షణీయంగా మార్చాయి. ఈ నేపథ్యంలో గత సెషన్‌లో నాస్‌డాక్ 0.65 శాతం, ఎస్ అండ్ పీ 0.48 శాతం పడిపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.20 శాతం లాభంతో ఉంది.

Sep 11 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.49 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.85 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.85 నష్టంతో ముగిశాయి.

Sep 11 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.88 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.43 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.89 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.67 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.32 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.25 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.50 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Nizamabad DMHO Harassment | అధికారం పేరిట ఆధిపత్యం.. బూతుల ‘సమీక్షలు’! నిజామాబాద్ జిల్లా వైద్య శాఖలో నియంత పాలన!

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 438 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
  • డీఐఐలు వరుసగా 23 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,025 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.75 నుంచి 0.77 కి పెరిగింది.
  • విక్స్ 1.05 శాతం తగ్గి 11.79 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు బలహీనపడి 95.44 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.19 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.11 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.97 వద్ద ఉన్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *