అక్షరటుడే వెబ్‌డెస్క్: Celebrity Voter Notices |తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ప్రముఖులకు ఎన్నికల సంఘం నుంచి ఊహించని షాక్ తగిలింది. నగరంలోని పలువురు సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులకు ఈసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో పలువురి పేర్లలో భారీగా వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఓటర్ల పేర్లు సరిపోలకపోవడం, తండ్రి పేర్లలో తప్పులు దొర్లడం, పాత ఎస్‌ఐఆర్ రికార్డులతో ప్రస్తుత వివరాలు లింక్ కాకపోవడం వంటి లోపాలను ఈ నోటీసుల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
Celebrity Voter Notices | ఈసీ నోటీసులు వీరికే..
ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ నోటీసుల జాబితాలో టాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి, హీరో మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, ప్రముఖ నటుడు వెంకటేష్ దగ్గుబాటి, ఆయన కుమార్తెలు ఉన్నారు. అలాగే నటి సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండలకు కూడా నోటీసులు అందాయి. మరోవైపు క్రీడా రంగం నుంచి భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులైన మురళీకృష్ణ ప్రసాద్ దివి, ఉపాసన కొణిదెలకూ ఈసీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ప్రముఖుల ఓటర్ల వివరాల్లోనే ఈ స్థాయిలో తప్పులు దొర్లడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Celebrity Voter Notices |వ్యక్తిగత హాజరుపై ఈసీ వెసులుబాటు..
ఈ విచారణకు సంబంధించి ప్రముఖులకు అధికారులు కొన్ని మినహాయింపులు కూడా ప్రకటించారు. ఒకవేళ విచారణ సమయంలో తాము అందుబాటులో లేకపోతే, తమ తరఫున మరొక ప్రతినిధిని పంపేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నేరుగా హాజరయ్యే సెలెబ్రిటీలు తమ అసలైన (ఒరిజినల్) ధ్రువపత్రాలను సమర్పించి, ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: Power Cuts | రైతులకు కరెంట్ కష్టాలు.. ఎండుతున్న పంటలు