అక్షరటుడే వెబ్డెస్క్: Congo School Fire | కాంగోలోని బుకావు నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.
బుకావులోని ఒక నివాస గృహంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. వేగంగా ఎగసిపడిన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు సైతం అంటుకున్నాయి. ఆ సమయంలో స్కూల్స్లో విద్యార్థులు ఉండటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పదుల సంఖ్యలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Congo School Fire | సహాయక చర్యలు ..
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి, మంటలు అంత వేగంగా పాఠశాలలకు ఎలా వ్యాపించాయనే కోణంలో అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
కాంగోలోని బుకావులో ఘోర అగ్నిప్రమాదం
ఒక ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వేగంగా వ్యాప్తి
మృతుల్లో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నట్లు అధికారుల ధ్రువీకరణ
కిటికీల నుంచి దూకే క్రమంలో, తొక్కిసలాట జరగడంతో గాయపడిన పలువురు విద్యార్థులు
దట్టమైన నివాస ప్రాంతం… pic.twitter.com/Wew3kSFxZp
— RTV (@RTVnewsnetwork) September 11, 2026
ఇది కూడా చదవండి: Five Day Banking | ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి