Ganesh Festival Nizamabad | గణేష్​ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..: మేయర్​ ఉమారాణి

నగరంలో గణేష్​ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మేయర్​ ఉమారాణి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Ganesh Festival Nizamabad | నగరంలో గణేష్​ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మేయర్​ ఉమారాణి అన్నారు. నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండలి నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Ganesh Festival Nizamabad | పోలీసుల సూచనలు పాటించాలి..

మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ వినాయక మండపాల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని, పోలీసు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా ఉత్సవాల సమయంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ధ్వని వ్యవస్థల పరిమితులు, ఇతర నిబంధనల గురించి మండలి నిర్వాహకులకు వివరించారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, 2వ టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై యాదగిరి  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sepsis Awareness | ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయవద్దు.. సెప్సిస్‌పై అప్రమత్తతే ప్రాణరక్షణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *