18 Hours Power Supply | వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి : దినేష్​ కులాచారి

జిల్లాలో వ్యవసాయ రంగానికి లో-వోల్టేజ్ సమస్య లేకుండా 18గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: 18 Hours Power Supply | జిల్లాలో వ్యవసాయ రంగానికి లో-వోల్టేజ్ సమస్య లేకుండా 18 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం ట్రాన్స్​కో ఎస్​ఈకి వినతిపత్రం అందజేశారు.

18 Hours Power Supply | 6 లక్షల ఎకరాల్లో సాగు..

దినేష్​ (Dinesh Kulachari) మాట్లాడుతూ. జిల్లావ్యాప్తంగా రైతాంగం సుమారు 2.5 లక్షల వ్యవసాయ పంపుసెట్ల కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని తెలిపారు. అయితే ప్రభుత్వం రైతులకు అవసరమైన విద్యుత్‌ను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న అరకొర 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా లో-వోల్టేజీతో వస్తుండటంతో వ్యవసాయ బోర్ల మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఎలాంటి లో-వోల్టేజీ, సరఫరా అంతరాయాలు లేకుండా రోజుకు 18 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, ప్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, తిరుపతిరెడ్డి, గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, తోట చిన్నయ్య, రాజేశ్వర్ రెడ్డి, అన్నం గోపి, పద్మా రెడ్డి, జగన్ రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, నాయిడి రాజన్న, కల్పె చిరంజీవి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ganesh Festival Nizamabad | గణేష్​ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..: మేయర్​ ఉమారాణి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *