UAE OPEC Exit : ఓపెక్‌కు షాక్.. 50 ఏళ్ల తర్వాత యూఏఈ వైదొలగింపు!

Naresh Chandan
UAE OPEC Exit : ఓపెక్‌కు షాక్.. 50 ఏళ్ల తర్వాత యూఏఈ వైదొలగింపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్: UAE OPEC Exit : ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 50 ఏళ్లకు పైగా సభ్యత్వం కొనసాగించిన OPEC నుంచి తాను వైదొలగనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి రానుంది.

ఈ నిర్ణయంతో యూఏఈ ఇకపై ఓపెక్ విధించే ఉత్పత్తి పరిమితులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. తద్వారా తన చమురు ఉత్పత్తిని స్వేచ్ఛగా పెంచుకునే అవకాశం కలుగుతుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది.

UAE OPEC Exit : ఇకపై స్వతంత్రంగా..

ప్రపంచ ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో యూఏఈ ఒకటిగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెట్టింది. ఓపెక్ కోటాల కారణంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోయిన యూఏఈ, ఇప్పుడు స్వతంత్రంగా తన వ్యూహాలను అమలు చేయగలదు.

UAE OPEC Exit : ట్రంప్​నకు అనుకూలంగానా..

యూఏఈ తాజా నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ఓపెక్‌పై పలు విమర్శలు చేశారు. చమురు ధరలను కృత్రిమంగా పెంచుతూ ప్రపంచాన్ని దోచుకుంటోందని ట్రంప్​ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యూఏఈ నిర్ణయం ట్రంప్ అభిప్రాయాలకు మద్దతుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఓపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ఇతర సభ్య దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయా..? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Hong Kong Housing Crisis : వరల్డ్ రిచెస్ట్ సిటీలో గృహ సంక్షోభం.. అట్ట పెట్టెల్లో జీవనం.. భారత్‌లోనూ ఇదే పరిస్థితి వస్తుందా?

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *