అక్షరటుడే, వెబ్డెస్క్: UAE Job Exploration Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఉద్యోగం సాధించాలనుకునే విదేశీ నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
స్థానిక స్పాన్సర్లు, ముందస్తు జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈ వెళ్లి నేరుగా ఉద్యోగం వెతుక్కునేందుకు వీలుగా కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల కోసం 60, 90, 120 రోజుల కాలవ్యవధితో కూడిన సింగిల్ ఎంట్రీ వీసాలను జారీ చేయనున్నట్లు ఎమిరేట్స్ ప్రభుత్వం వెల్లడించింది.
UAE Job Exploration Visa | జాబ్ ఆఫర్ లేకుండానే ప్రయాణం
భారతీయ ఉద్యోగార్థులతో సహా అర్హత కలిగిన విదేశీయులు ముందస్తు ఉద్యోగ ప్రకటన, ఆఫర్ లెటర్ లేకపోయినా యూఏఈ వెళ్లవచ్చు. అక్కడికి చేరుకున్న తర్వాత వివిధ కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరై, నియామక ప్రక్రియలో నేరుగా పాల్గొనే వెసులుబాటు ఉంటుంది.
Extramarital Dating Apps | వివాహేతర సంబంధాల యాప్ల వినియోగంలో హైదరాబాద్ టాప్–5లో..!
దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ వీసా లభించదని, నిర్దిష్ట అర్హతల ఆధారంగానే ప్రభుత్వం వీసాలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు మొదటి, రెండు, మూడో (1, 2, 3) నైపుణ్య స్థాయిలు (Skill Levels) కలిగి ఉండాలి.
UAE Job Exploration Visa | గత రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో గత రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూఏఈలో నివాసముండే కాలంలో అయ్యే ఖర్చులను భరించడానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
కనీసం ఆరు నెలల చెల్లుబాటు వ్యవధి ఉన్న పాస్పోర్ట్, తాజా ఫోటోలు, ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలు తప్పనిసరి. విదేశాల్లో స్థిరపడాలని భావించే నిరుద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది.