BRICS Vision Modi | విన్-విన్ బ్రిక్స్ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ

బ్రిక్స్​ సమ్మిట్​లో భాగంగా రెండో రోజు ప్రధాని మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధిపై ఆయన మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRICS Vision Modi | బ్రిక్స్​ సమ్మిట్ (BRICS Summit)​లో భాగంగా రెండో రోజు ప్రధాని మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధిపై ఆయన మాట్లాడారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై తక్షణ చర్యలు అవసరం అన్నారు.

ఢిల్లీలోని భారత్​ మండపంలో బ్రిక్స్​ సదస్సు జరుగుతున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భావి తరాల కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహాకారం బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. బ్రిక్స్​ సదస్సులో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కేంద్రీకరించామని తెలిపారు.

 BRICS Vision Modi | ఉమ్మడి పురోగతి..

వినూత్నమైన, విస్తరించదగిన పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదించామని మోదీ తెలిపారు. డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగించవచ్చన్నారు. సాంకేతికతను స్వీకరించడంలో తాము సమ్మిళితత్వానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Indonesia Ship Missing | సముద్రంలో గల్లంతైన ఇండోనేషియా నౌక.. 102 మందిని రక్షించిన అధికారులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *