అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Clay Ganesh Idols | పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలని నగర మేయర్ ఉమారాణి (Nizamabad Mayor) పేర్కొన్నారు. డీసీసీ(DCC Nizamabad) అధ్యక్షుడు నగేష్రెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి మట్టిగణపతులను ఉచితంగా అందజేశారు.
Clay Ganesh Idols | 37వ డివిజన్లో..
నగరంలోని 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పర్యావరణాన్ని కాపాడేందుకు మనవంతుగా కృషి చేయాలని, ప్రజలందరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్, కో ఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బంగారం ధరలపై.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు