అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Comments | న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు ముగిసినా, అక్కడి విందు రాజకీయాలను మాత్రం వేడెక్కించింది. సదస్సులో విదేశీ అతిథులకు కేవలం శాఖాహార (వెజ్) వంటకాలే వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. దేశంలో దాదాపు 80 శాతం మంది మాంసాహారమే తింటారని గుర్తుచేశారు.
Rahul Gandhi Comments | రాహుల్ గాంధీ, పవన్ ఖేరా విమర్శలు..
“రికార్డు కోసం చెబుతున్నాను.. మన దేశంలో 80 శాతం మంది ప్రజలు నాన్-వెజిటేరియన్లే. మన నాన్-వెజ్ వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే నా సోదరి చేసే చోలే భటూరే కూడా చాలా బాగుంటుంది” అంటూ రాహుల్ గాంధీ ఒక ఫొటోతో సహా పోస్ట్ చేశారు. దీనికి మద్దతుగా మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. భారత్లోని వైవిధ్యమైన ఆహార సంస్కృతిలో ప్రపంచ స్థాయి నాన్-వెజ్ వంటకాలు కూడా ఉన్నాయని, విదేశీ నేతలకు వాటిని ఎందుకు పరిచయం చేయలేదని ప్రశ్నించారు. భారతీయులపై బీజేపీ తన శాఖాహారపు రుచులను రుద్దుతోందని, ఇప్పుడు అదే ధోరణిని విదేశీ అతిథులపై కూడా ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
Rahul Gandhi Comments | కేంద్ర మంత్రి ఘాటు బదులు..
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ( Kiran Rijiju )తీవ్రంగా స్పందించారు. బ్రిక్స్ దేశాల అధినేతలు మన శాఖాహార వంటకాలను ఎంతో ఆస్వాదించారని చెప్పారు. కేవలం భోజనంపై కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక రుచులను ప్రతిబింబించేలా, పోషక విలువలతో ఈ వెజ్ మెనూను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.
Rahul Gandhi Comments | మెనూలో ప్రత్యేకతలివే..
ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ఈ విందులో పూర్తిగా రుచికరమైన శాకాహార వం టకాలకే పెద్దపీట వేశారు. భారత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా చిరుధాన్యాలకు (శ్రీ అన్న) అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఖాండ్వీ, పనీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, మిల్లెట్ పులావ్, మష్రూమ్ గలౌటీ, జిలేబీ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. సుస్థిర ఆహార విధానాన్ని చాటేలా ఈ మెనూను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Konda Surekha Warning | ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కొండా సురేఖ వార్నింగ్