Mumbai Kalma Attack Case | ప్రాణాల కోసం ఆరాటం… తెల్లవారుజామున భయానక క్షణాలు.. ముంబయిలో పహల్గావ్​ తరహాలో దాడికి ప్రణాళిక!

Naresh Chandan
Mumbai Kalma Attack Case

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mumbai Kalma Attack Case | ముంబయిలో మరో దారుణం వెలుగు చూసింది. హిందువులనే టార్గెట్‌ చేస్తూ.. ‘పహల్గామ్’ తరహా దాడికి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. కల్మా చదవమంటూ సెక్యూరిటీ గార్డులపై జుబైర్ అన్సారీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది.

Mumbai Kalma Attack Case | ‘కల్మా’ చదవమని ఒత్తిడి

స్థానిక సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా భయంకర్ ప్రాంతంలో ఏప్రిల్ 27, 2026 సోమవారం.. మామూలుగా నిశ్శబ్దంగా ఉండే తెల్లవారుజామున 4 గంటలు… ఆ రోజు మాత్రం భయంతో నిండిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు అది జీవితాంతం మరిచిపోలేని అనుభవంగా మిగిలిపోయింది. జైబ్ జుబైర్ అన్సారీ అనే వ్యక్తి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేశాడు.

దాడి చేయడానికి ముందు, గార్డులను అన్సారీ “మీ మతం ఏంటి?” అని అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా, వారిని బలవంతంగా ‘కల్మా’ చదవమని ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో వారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.

Mumbai Kalma Attack Case | దర్యాప్తులో విస్తుపోయే నిజాలు:

అన్సారీ దాదాపు 19 ఏళ్ల పాటు అమెరికాలో నివసించి తిరిగి వచ్చిన వ్యక్తి. అతని భార్య ఆఫ్ఘనిస్తాన్ దేశస్థురాలు. దాడి జరిగిన 90 నిమిషాల్లోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అన్సారీ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు విస్తుపోయే ఆధారాలు లభించాయి. ముఖ్యంగా ISIS/Daesh నుంచి వచ్చిన ‘తహ్రీర్’ అనే లేఖ దొరికినట్లు సమాచారం. ఆ లేఖలో ‘కల్మా’ గురించి సమాచారం, ’లోన్ వోల్ఫ్’ (ఒంటరిగా దాడి చేయడం) పద్ధతులు, ఖిలాఫత్‌ను ఎలా స్థాపించాలి?, ఖిలాఫత్ గురించి అల్లా ఏం చెప్పాడు? వంటి వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ కేసులో ఉగ్రవాద కోణాన్ని దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ATS రంగంలోకి దిగింది. నిందితుడికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మతం అడిగి చంపే తరహాలోనే ఈ దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: Upasana Konidela | పాశ్చాత్యం వద్దు.. భారతీయ సంప్రదాయమే ముద్దు.. టాయిలెట్ వినియోగంపై ఉపాసన ప్రచారం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *