Vijay London Tour | సీఎం విజయ్ లండన్ పర్యటనపై రాజకీయ దుమారం.. త్రిషతో కలిసి తిరగడంపై విపక్షాల ఆగ్రహం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటన రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay London Tour | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటన రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పేరుతో లండన్‌కు వెళ్లిన ఆయన, అక్కడ ప్రముఖ నటి త్రిషతో కలిసి కనిపించడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తున్నారంటూ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు మండిపడుతున్నాయి. పెట్టుబడుల కోసం వెళ్లామని చెప్పి నటితో కలిసి కార్ రేస్‌లలో తిరగడమేంటని నిలదీస్తున్నాయి.

Vijay London Tour |పళనిస్వామి ఎద్దేవా..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సీఎం విజయ్ లండన్ టూర్‌ను తీవ్రంగా విమర్శించారు. తాను చూసిన లండన్ పర్యటన ఫొటోల్లో కనీసం ఒక్క పారిశ్రామికవేత్త కూడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. పెట్టుబడుల కోసం వెళ్లామని చెప్పడానికి, అక్కడ జరుగుతున్నదానికి అసలు సంబంధం లేదని ఆయన మండిపడ్డారు.

Vijay London Tour | బీజేపీ నేతల ప్రశ్నలు..

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ పర్యటనపై స్పష్టత కోరారు. ముఖ్యమంత్రితో పాటు లండన్‌లో పర్యటిస్తున్న వారి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో విజయ్‌తో పాటు నటి త్రిష ఎందుకు కనిపించారని ఒక బీజేపీ నాయకుడు ప్రశ్నించారు.

సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు పెట్టుబడుల సాధన కోసం సీఎం లండన్ వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారని, ఐదు రోజులు గడిచినా పెట్టుబడులకు సంబంధించిన ఒక్క అధికారిక సమావేశం కూడా జరగలేదని ఆయన విమర్శించారు. కేవలం నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసులో ముఖ్యమంత్రి, మంత్రి అధవ్ అర్జున, నటి త్రిష కనిపించారే తప్ప, పారిశ్రామికవేత్తలు ఎవరూ కనిపించలేదని ఆయన తప్పుపట్టారు.

ఇది కూడా చదవండి: PCC Chief | తలసానిని ప్రతిపక్ష నేత చేయాలి : పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *