అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Telangana Armed Struggle | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. నగరంలోని సీపీఐ జిల్లాశాఖ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు.
Telangana Armed Struggle | 17న బహిరంగ సభను సక్సెస్ చేయాలి..
సుధాకర్ మాట్లాడుతూ.. ఈనెల 17న నాంపల్లి గ్రౌండ్స్‌లో జరిగే సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలను స్మరిస్తూ ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17న హైదరాబాద్ (Hyderabad)లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరుకావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా జరుపుతున్నప్పటికీ ఈ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రెస్మీట్లో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై.ఓమయ్య, సీపీఐ జిల్లా నాయకులు పి.హన్మాండ్లు, ప్రసాద్, గోవర్ధన్, రాధా కుమార్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bhukakpalli Hanuman Temple | భూకాన్పల్లి హనుమాన్ ఆలయాభివృద్ధికి మంత్రి శంకుస్థాపన