Helicopter Crash | అమెరికాలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి

అమెరికాలో ఒక వార్తా సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :​ Helicopter Crash | అమెరికా (America)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లాస్ ఏంజిల్స్‌లో ఒక వార్తా సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

నగరంలో ఎస్‌యూవీ సిటీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ బస్సు ప్రమాదాన్ని న్యూస్​ ఛానెల్​ సిబ్బంది ఆ ప్రమాదాన్ని హెలికాప్టర్​ ద్వారా చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతని పరిస్థితి వెంటనే తెలియరాలేదని లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక శాఖ తెలిపింది.

Helicopter Crash | పార్కింగ్​ ప్రదేశంలో..

హెలికాప్టర్ లోపల నుంచి రికార్డ్ చేసిన ఒక వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు ప్రమాదం చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో కెమెరా అకస్మాత్తుగా తీవ్రంగా వణకడం వీడియో కనిపించింది. ఒక పెద్ద భవనంలోని పార్కింగ్ ప్రదేశంలో ఇది కూలిపోయింది. ఈ ప్రమాదంలో పార్కింగ్​ ప్రదేశంలో ఉన్న వ్యక్తి, హెలికాప్టర్​లోని ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో నాలుగు వాహనాలు, రెండు కంటైనర్లు దెబ్బతిన్నాయి.

ఇది కూడా చదవండి..: Houthi Drone Attack | మక్కాపై డ్రోన్​ దాడికి యత్నం.. అడ్డుకున్న సౌదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *