Pakistan Ship Collision | భారత నౌకను ఢీకొన్న పాక్​ షిప్​

ఒక పాకిస్తానీ నౌక, ఇండియన్​ నేవీకి చెందిన షిప్​ను ఢీకొంది. దీనిపై భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Ship Collision | అంతర్జాతీయ జలాల్లో ఒక పాకిస్తానీ నౌక, ఇండియన్​ నేవీకి చెందిన షిప్​ను ఢీకొంది. దీనిపై భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉత్తర అరేబియా సముద్రంలో సెప్టెంబర్ 15న సాయంత్రం సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకకు ఒక పాకిస్తానీ నౌక (Pakistani Ship) సమీపంగా రావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తానీ నౌక అధిక వేగంతో, వృత్తివిరుద్ధంగా, అసురక్షిత పద్ధతిలో విన్యాసాలు చేస్తూ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.

Pakistan Ship Collision | నిబంధనలకు విరుద్ధంగా..

సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికల గురించి ముందుగా తెలియజేయడానికి భారత్-పాకిస్తాన్ మధ్య 1991లో ఒప్పందం కుదిరింది. ఒప్పందంలోని ఆర్టికల్ 10ను పాకిస్తానీ నౌక నేరుగా ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. ఈ మేరకు పాక్​ హైకమిషన్​ర్​ పిలిపించి నిరసన తెలిపింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Telangana AICC In Charge | కాంగ్రెస్ నయా వ్యూహం..తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి మార్పునకు ముమ్మర కసరత్తు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *