DJ Ban Nizamabad | డీజేలకు అనుమతి లేదు : సీపీ సాయి చైతన్య

జిల్లాలో పరిమితికి మించి ధ్వని ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్​ సిస్టంలపై నిషేధం ఉందని సీపీ సాయి చైతన్య తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :  DJ Ban Nizamabad | జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను పెట్టొద్దన్నారు.

ఎక్కువ సౌండ్​ వచ్చే డీజేలను ఏర్పాటు చేయొద్దన్నారు. డీజేలతో దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధం ఉందని చెప్పారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని ఉత్పత్తి చేసే డీజేలు. సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో నిషేధించినట్లు పేర్కొన్నారు. సభలు, సమావేశాలు, జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

DJ Ban Nizamabad | సెక్యూరిటీ నిబంధనలు పాటించాలి

జిల్లాలో 500 మందితో కూడిన సమావేశాలు, సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అని సీపీ పేర్కొన్నారు. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు.

ఇది కూడా చదవండి..: Lingampet Ayyappa Temple | నేడు తెరుచుకోనున్న లింగంపేట అయ్యప్ప ఆలయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *