Disha Salian | ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్​ నోటీసు

దిశా సాలియన్​ మృతి కేసులో శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేకు ఆమె తండ్రి రూ.500 కోట్ల లీగల్ నోటీసు పంపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Disha Salian | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణానికి సంబంధించిన కేసులో రూ. 500 కోట్ల లీగల్ నోటీసు జారీ అయింది. శివసేన (UBT) నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నుంచి దిశా తండ్రి సతీష్ సాలియన్ రూ.500 కోట్ల నష్టపరిహారాన్ని కోరారు.

ముంబై (Mumbai)లోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనం నుంచి పడి దిశా సాలియన్ 2020 జూన్ 8న మరణించారు. ఈ కేసును పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా నమోదు చేశారు. సరిగ్గా ఆరు రోజుల తర్వాత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించారు. దీంతో దిశా తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కొత్తగా దర్యాప్తు చేయాలని కోరారు. ఆదిత్య ఠాక్రే, డినో, సూరజ్ పంచోలితో సహా పలువురు వ్యక్తులపై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కోరారు.

Disha Salian | రూ. 500 కోట్ల పరువు నష్టం దావా

న్యాయం కోసం సతీష్ సాలియన్ చేస్తున్న ప్రయత్నాన్ని “రాజకీయ ప్రేరేపితం”గా చిత్రీకరించడానికి ఆదిత్య ఠాక్రే, అనిల్​ దేశ్​ముఖ్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు. వారు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సతీష్ సాలియన్ డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Semicon India 2026 | సెమీ కండక్టర్​ హబ్​గా భారత్ : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *