అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Telangana Praja Palana Day | రాష్ట్రంలో సుస్థిర పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
Telangana Praja Palana Day | స్వేచ్ఛావాయువు పీల్చుకున్న రోజు..
తెలంగాణ (Telangana) సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు పోయి 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిందన్నారు. నేడు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా పేరొందిందన్నారు. జిల్లాలో రైతు భరోసా, మహాలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత పథకం, రైతు ఋణ మాఫీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం సజావుగా జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో పయనిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
Telangana Praja Palana Day | రైతు భరోసా..
రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం 2026 సీజనుకు గాను జిల్లాలో 2,75,000 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.316 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశామన్నారు. జిల్లాలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 75,728 కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేశామని తెలిపారు. మొత్తం 4 ,77,780 ఆహార భద్రత కార్డుల ద్వారా 16,9,447 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. జిల్లాలో 2026-27 ఖరిఫ్ సీజన్‌కు గాను, 736 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,50,000వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు అంచనా వేశామన్నారు. అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.
Telangana Praja Palana Day | ఇందిరమ్మ ఇండ్ల పథకం
జిల్లాలో మొదటి దశ కింద 17,151 ఇళ్లు మంజూరు చేశామన్నారు. అందులో 10,071 పూర్తయ్యాయన్నారు. మిగిలిన 7,800 ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. రెండోదశలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు కేటాయించామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 10 కోట్ల 38 లక్షల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, సీపీ సాయిచైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Praja Palana Day | రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి : మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరేళ్ల శారద