Ganesh Mandap Geotagging | గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ తప్పనిసరి: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఉన్న అన్ని గణేష్​ మండపాలకు జియో ట్యాగింగ్​ తప్పనిసరి అని సీపీ సాయిచైతన్య తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Ganesh Mandap Geotagging | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఉన్న అన్ని గణేష్​ మండపాలకు జియో ట్యాగింగ్​ తప్పనిసరి అని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పలు మండపాలను ఆయన సందర్శించారు.

Ganesh Mandap Geotagging | పటిష్టమైన భద్రత

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ వరిధిలో గణేష్ మండపాలలో పోలీసుల నిఘా వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతుందని సీపీ (CP Sai Chaitanya) అన్నారు. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలతో పాటు వాటి పరిసరా ప్రాంతాల్లోను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కార్యచరణ ప్రణాళికతో వెళ్తున్నామన్నారు. నిజామాబాద్ కమిషనరేట్​ వరిధిలో మొత్తం 5,681 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు.

Ganesh Mandap Geotagging | ఆన్​లైన్ ద్వారా గణేష్ మండపాల రిజిస్ట్రేషన్

ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన పోలీస్ అనుమతులకై గణేష్ నవరాత్రి నిర్వాహకులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని సీపీ తెలిపారు. పోలీనులు గణేష్ మండపాలకు కల్పించడంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతి గణేష్ విగ్రహాన్ని జియో ట్యాగింగ్​కు అనుసంధానం చేస్తామన్నారు.

Ganesh Mandap Geotagging | 24 గంటలు బ్లూకోర్డ్స్ సిబ్బంది పర్యవేక్షణ

గణేష్ మండపాలకు కల్పిస్తున్న భద్రతలో భాగంగా సేక్టార్ వారిగా విధులు నిర్వహించే బ్లూ కోర్డ్స్​ పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజు మూడు షిఫ్టుల వారిగా మూడు పర్యాయాలు మండపాలను సందర్శిస్తారని సీపీ తెలిపారు. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తూ భద్రత విషయంలో నిర్వాహకులకు సూచనలు చేస్తూ మండపాల వారిగా జారీ చేసినా పాయింట్ బుక్​లో సెక్టార్ పోలీసు సిబ్బంది సంతకం చేస్తారన్నారు. నిజామాబాద్ లో ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్ లో దాదావు 100 సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అనుసంధానం చేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: BRS Tribal Development | బీఆర్ఎస్ హయాంలోనే తండాల అభివృద్ధి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *