అక్షరటుడే, వెబ్డెస్క్ : Police Exam Dates | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్ష వివరాలను తాజాగా వెల్లడించింది.
రాష్ట్రంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలలో 7,437 ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో లక్షలాది నిరుద్యోగులు ఈ జాబ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రిక్రూట్మెంట్ పరీక్షల తాత్కాలిక తేదీలను వెల్లడించింది. SI పరీక్ష 2026 నవంబర్ 29న, PC (పోలీస్ కానిస్టేబుల్) రాత పరీక్ష 2026 డిసెంబర్ 20న నిర్వహించాలని నిర్ణయించింది.
Police Exam Dates | 5.77 లక్షల దరఖాస్తులు
పోలీస్ ఉద్యోగాల కోసం 4,29,000 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 5,77,064 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఇందులో 25.33 శాతం మంది మహిళలు ఉన్నారు. 49.19 శాతం బీసీ అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. ఎస్సై పోస్టులకు 1,60,756, కానిస్టేబుల్ జాబ్స్ కోసం 3,89,356 మంది అప్లై చేసుకున్నారు. అభ్యర్థుల గుర్తింపును తప్పుగా చూపడాన్ని (impersonation) అరికట్టేందుకు ప్రవేశపెట్టిన కొత్త విధానమైన ‘ఆధార్ ఫేస్ అథెంటికేషన్’ ప్రక్రియను 97.4 శాతం అభ్యర్థులు పూర్తి చేశారు. సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
దీనిని కూడా చదవండి : Treasury Officers Bribe | రూ.2.50 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు