అక్షరటుడే వెబ్‌డెస్క్: Sri Rama Agri Genetics | ఎస్ఆర్ఎస్ గ్రూప్ (SRS Group) సంస్థకు చెందిన ‘శ్రీరామ అగ్రి జెనెటిక్స్’ (Sri Rama Agri Genetics) అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని బేగ్‌పేట్ మేరిగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన రెండో ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026 వేదికగా ఈ ప్రతిష్టాత్మక ‘క్ాలిటీ స్టాండర్డ్స్ అవార్డు’ను అందుకుంది. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ( Shiv Pratap Shukla )చేతుల మీదుగా ఎస్ఆర్ఎస్ గ్రూప్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చుందురి రాంబాబు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA), ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్, నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , ఇక్రిసాట్ (ICRISAT) సంయుక్తంగా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఆహార భద్రత భవిష్యత్తు కోసం భాగస్వామ్యాలు” అనే ప్రధాన థీమ్‌తో ఈ సమ్మిట్ కొనసాగింది.
Sri Rama Agri Genetics | 28 ఏళ్ల సేవకు గుర్తింపు..
వ్యవసాయ రంగంలో 28 ఏళ్ల పాటు అందిస్తున్న అత్యుత్తమ సేవలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు గాను ఎస్ఆర్ఎస్ గ్రూప్‌ను ఈ అవార్డు వరించింది. డీఎస్‌ఐఆర్ (DSIR) గుర్తింపు పొందిన రీసెర్చ్ ఫెసిలిటీ, ఎన్‌ఏబీఎల్ (NABL) అక్రిడిటేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌తో ఈ సంస్థ ఎల్లప్పుడూ వాతావరణ మార్పులను తట్టుకునే, రైతులకు మేలు చేసే హైబ్రిడ్ విత్తన సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది.
భారతదేశంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఎస్ఆర్ఎస్ గ్రూప్.. ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా దేశాలకూ తన సేవలను విస్తరిస్తోంది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జలు, పత్తి , వివిధ రకాల కూరగాయల విత్తనాల పరిశోధన, ఉత్పత్తి , మార్కెటింగ్‌లో ఈ సంస్థ ప్రత్యేకత చాటుకుంటోంది.
Sri Rama Agri Genetics | క్వాలిటీ స్టాండర్డ్స్ అవార్డు..
ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్ గ్రూప్ సీఎండీ శ్రీ చుందురి రాంబాబు మాట్లాడుతూ.. “ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్ వంటి ప్రపంచ వేదికపై క్వాలిటీ స్టాండర్డ్స్ అవార్డు అందుకోవడం ఎస్ఆర్ఎస్ గ్రూప్ కుటుంబానికి ఎంతో గర్వకారణం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయోత్పత్తిని పెంచాలనే మా లక్ష్యానికి, నాణ్యతపై మా నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మా రీసెర్చ్ కేంద్రాల నుంచి ఆఫ్రికా వరకు.. రైతులకు అత్యుత్తమ దిగుబడులను అందించే నాణ్యమైన, వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అందించడమే మా ఏకైక లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CBSE Three Language Policy | త్రిభాషా విధానం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు