అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad NIA Court | హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఒక సంచలన తీర్పును వెలువరించింది. 2019లో వెలుగు చూసిన ఈ కేసులో విచారణ పూర్తిగా ముగిసింది. సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో, ఏకంగా 9 మంది నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఈ కేసులో శిక్ష పడిన వారిలో 8 మంది బంగ్లాదేశ్ దేశస్తులు ఉండటం గమనార్హం.
Hyderabad NIA Court | ఉద్యోగాల ఆశ చూపి..
బంగ్లాదేశ్ ( Bangladesh )నుంచి మహిళలను అక్రమంగా భారత్‌కు తరలిస్తున్న ముఠా గుట్టును 2019లో అధికారులు బట్టబయలు చేశారు. నగర పరిధిలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. అమాయక మహిళలకు మంచి ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి, వారిని అక్రమంగా సరిహద్దులు దాటించి, బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్న ఈ అంతర్జాతీయ రాకెట్‌ను పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై 2019లో తొలిసారిగా కేసు నమోదైంది. ఆ తర్వాత కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఈ కేసును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోతుగా దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ అధికారులు A1 నుంచి A12 వరకు మొత్తం 12 మంది నిందితులపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Hyderabad NIA Court | సాక్ష్యాధారాల పరిశీలన ..
ఈ కేసులో కోర్టులో సుదీర్ఘ వాదనలు ముగిసిన తర్వాత, న్యాయమూర్తి సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించారు. నిందితులపై నేరం స్పష్టంగా రుజువు కావడంతో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెల్లడించింది. మొత్తం నిందితుల్లో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పును ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్