అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PMAY Rural Houses | హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం కలిశారు. మాదాపూర్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయనను సన్మానించారు.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా రాష్ట్రానికి మొదటి విడతలో 2 లక్షల ఇళ్లను కేటాయించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు. 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని జులైలో సీఎం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా రెండు లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎం కోరారు.
PMAY Rural Houses | సహకారం అందించాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Danam Nagender | ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు భయం : దానం నాగేందర్