TDP Working President | టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ ప్రమాణం

Balla Sandeep Kumar

అక్షరటుడే, మంగళగిరి: TDP Working President | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ తన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం అత్యంత ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు.

TDP Working President | లోకేశ్‌కు కీలక బాధ్యతలు..

ఈ వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం.. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించడం. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహాన్ని మేళవిస్తూ చంద్రబాబు ఈసారి కమిటీలను రూపొందించారు. పొలిట్ బ్యూరోతో పాటు జాతీయ , రాష్ట్ర కమిటీల సభ్యులంతా ఈ కార్యక్రమంలో ప్రమాణం చేశారు.

ఇది కూడా చదవండి..: Telugu Desam Party | పసుపు జెండా పౌరుషం తగ్గదు.. కార్యకర్తే ఈ పార్టీకి అధినేత : చంద్రబాబు

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *