అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nifty Sensex Friday | దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా రేంజ్ బౌండ్ లో కొనసాగింది. ఇంట్రాడేలో 74,294 నుంచి 74,728.44 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 23,286 నుంచి 23,389 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరి అరగంటలో సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. దీంతో స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టీ మాత్రం లాభాలతో ముగియడం గమనార్హం.
Nifty Sensex Friday | గ్యాప్ అప్ లో ప్రారంభమైనా..
దేశీయ మార్కెట్లు (Domestic markets) శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 261 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 18 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 218 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 26 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 74 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 74,294వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 23,346 వద్ద స్థిరపడ్డాయి.
Nifty Sensex Friday | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,714 కంపెనీలు లాభపడగా 1,618 స్టాక్స్ నష్టపోయాయి. 216 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 164 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 111 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 3.72 శాతం, పవర్‌గ్రిడ్ 2.47 శాతం, హ్డెఎఫ్సీ బ్యాంక్ 2.26 శాతం, ఎయిర్టెల్ 2.11 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.08 శాతం లాభపడ్డాయి.
Top Losers : టీసీఎస్ 4.33 శాతం, టైటాన్ 2.11 శాతం, ఆసియన్ పెయింట్ 2.00 శాతం, మారుతి 1.98 శాతం, టెక్ మహీంద్రా 1.82 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | లాభాల్లో ప్రధాన సూచీలు..