అక్షరటుడే, వెబ్‌డెస్క్: Railway Jobs Recruitment | టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై, రైల్వేలో కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారికి భారతీయ రైల్వే (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం 11,127 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
Railway Jobs Recruitment | షార్ట్ నోటీస్‌ను ఆర్ ఆర్ బీ విడుదల
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం సెంట్రల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (Central Recruitment Notification ) 01/2026 షార్ట్ నోటీస్‌ను ఆర్ ఆర్ బీ విడుదల చేసింది. ఇది రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ముందే సమాచారం అందించడానికి విడుదల చేసిన షార్ట్ నోటీస్. అంటే ఇది తాత్కాలిక నోటిఫికేషన్ మాత్రమే. పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు తెలుస్తాయి. షార్ట్ నోటీస్ వివరాలిలా ఉన్నాయి.
Railway Jobs Recruitment | భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 11,127.
పోస్ట్ పేరు : అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ)
భర్తీ చేసే ఆరఆర్‌బీ రీజియన్లు.. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
అర్హత: సంబంధిత విభాగాలు, ట్రేడులలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : ఈ ఏడాది జూలై ఒకటో తేదీనాటికి 18-30 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం : నెలకు రూ.19,900.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 15.05.2026.
దరఖాస్తు గడువు : 14.06.2026.
ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
రీజియన్ల వారీగా ఖాళీలు, పరీక్ష విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పూర్తి వివరాలకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లో సంప్రదించగలరు.
ఇది కూడా చదవండి..: Bangladesh Measles | బంగ్లాదేశ్‌లో తట్టు మహమ్మారి విజృంభణ.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేసిన WHO

