Red Cross Society Elections | ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ నూతన మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

shashi kiran Mottala

​అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Red Cross Society Elections | ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ (Nizamabad Red Cross) నూతన మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఎన్. శ్రీనివాసరావు శనివారం వివరాలు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితాను కూడా వెల్లడించారు.

Red Cross Society Elections | నామినేషన్ల స్వీకరణ..

ఎన్నికల్లో భాగంగా ఈనెల 24న ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా రెడ్​క్రాస్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రతి నామినేషన్‌ను ఇద్దరు అర్హత కలిగిన సభ్యులు ప్రతిపాదించి, బలపరచాల్సి ఉంటుంది. తిరిగి చెల్లించబడని నామినేషన్ డిపాజిట్ రుసుము రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది.

Red Cross Society Elections | నామినేషన్ల పరిశీలన..

ఈనెల 25న ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. 26న ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్నిక అవసరమైన పక్షంలో అక్టోబర్ 4న నిజామాబాద్ బస్​స్టాండ్ పక్కన ఉన్న ఆదర్శ హిందీ మహా విద్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 4న సాయంత్రం 4గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ​అదే రోజున నూతన కమిటీ ప్రమాణ స్వీకారంతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ట్రెజరర్, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలను కూడా నిర్వహిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. అర్హత కలిగిన సభ్యులందరూ ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: చక్కెర ధరలకు కళ్లెం వేసేలా కేంద్రం కీలక నిర్ణయం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *