Danam Nagender | సుప్రీం కోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Danam Nagender | దానం నాగేందర్​ యూ టర్న్​ తీసుకున్నారు. నిన్న హైకోర్టు (High Court) తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పిన ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నికలకు సిద్ధమని, సుప్రీంను ఆశ్రయించనని శుక్రవారం ఆయన మాట్లాడారు. శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్​ లీవ్​ పిటిషన్​ దాఖలు చేశారు.

దానం నాగేందర్ బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై స్పీకర్​ అనర్హత వేటు వేయకపోవడంతో బీఆర్ఎస్ (BRS)​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం దానం నాగేందర్​పై అనర్హత వేటు వేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. దానం పార్టీ మారినట్లు ఆధారాలు లేవని గతంలో స్పీకర్​ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది.

Danam Nagender | కోర్టు అనుమతిస్తుందా..

దానం నాగేందర్​ పిటిషన్​ను సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది కోర్టు ముందుకు సోమవారం వచ్చే అవకాశం ఉంది. దానం పిటిషన్​పై సుప్రీం అప్పీల్​కు అనుమతిస్తే ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్​రెడ్డి, పాడి కౌశిక్​రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్​ పిటిషన్​ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై ఉత్తర్వులు ఇచ్చే సమయంలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

Danam Nagender | స్పీకర్​ వర్సెస్​ హైకోర్టు

ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు స్వీకరిస్తే.. స్పీకర్​ అధికారులు, న్యాయస్థానం పరిధిపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో అనేక మార్లు స్పీకర్​, న్యాయస్థానాల మధ్య కేసులు వచ్చాయి. స్పీకర్​ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని వారు వాధిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు పలుమార్లు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. గతంలో అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు ఉండేది కాదు. అయితే సుప్రీంకోర్టు 3 నెలల్లో విచారణ చేపట్టి నిర్ణయం తెలపాలని స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని.. సాంకేతిక కారణాలతో స్పీకర్లు అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దానం నాగేందర్​ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి, తీర్పు చెబితే ఫిరాయింపులపై కీలకం కానుంది.

ఇది కూడా చదవండి : DUSU Election Results | ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *