అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BMW Accident | ముంబై (Mumbai)లోని కోస్టల్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి వంతెన పైనుంచి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కోస్టల్ రోడ్డు (Coastal Road)పై మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పింది. అనంతరం వంతెనపై గల రెయిలింగ్‌ను ఢీకొని కింద పడిపోయింది. ఎత్తునుంచి పడటంతో అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అందులో ముగ్గురు మరణించారు. మరో యువకుడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
BMW Accident | నుజ్జునుజ్జయిన కారు
కారు అతివేగంగా ఉండటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత బీఎండబ్ల్యూ కారు నుజ్జునుజ్జయింది. మృతులను షనయ్ గజ్జల్ (21), ధైర్య సేథ్(17) గా గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం ఉదయం 5:20 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Mumbai, Maharashtra: Visuals from the spot following a fatal accident on the Coastal Road near Lotus Jetty. According to the BMC, an overspeeding BMW heading towards Haji Ali from Marine Drive crashed, leaving three dead and one critically injured. pic.twitter.com/Oj8MSiKH9n
— ANI (@ANI) September 20, 2026
దీనిని కూడా చదవండి : Rain Forecast | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన