అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Telangana Disabled Welfare | దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Telangana Disabled Welfare | దివ్యాంగుల కోసం..
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ఎదుగుదలకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎల్లప్పుడూ బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమాన్ని అత్యంత ప్రాముఖ్యం ఇస్తోందని పేర్కొన్నారు. వారికి అవసరమైన సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Telangana Disabled Welfare | అవసరమైన అన్ని సహాయ సహకారాలు..
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed Ali Shabbir) మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజంలో వెనుకబడిన వర్గంగా కాకుండా సమాన హక్కులతో ముందుకు రావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంటుందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే పార్టీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
దివ్యాంగులకు అందిస్తున్న ఈ సహాయ ఉపకరణాలు వారి రోజువారీ జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఆటో, వీల్‌చైర్స్, పలు సహాయక ఉపకరణాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Forest Officer Bike Burning | ఫారెస్ట్ అధికారి బైక్ దగ్ధం.. రావుట్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఘటన..


[…] ఇది కూడా చదవండి..: Telangana Disabled Welfare | దివ్యాంగుల సంక్షేమానికి క… […]