Punjab Encounter | పంజాబ్​ పోలీసు హత్య కేసు.. నిందితుడి ఎన్​కౌంటర్

పంజాబ్​లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ హత్య కేసులో ఇద్దరు నిందితులలో ఒకరిని పోలీస్​ ఎన్​కౌంటర్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Punjab Encounter | పంజాబ్​లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) హత్య కేసులో ఇద్దరు నిందితులలో ఒకరిని పోలీస్​ ఎన్​కౌంటర్​ చేశారు. అమృత్‌సర్‌లోని ముల్చక్‌కు చెందిన దీపక్ సింగ్ అనే నిందితుడు శుక్రవారం సీనియర్ పోలీసు అధికారి హర్జిత్ సింగ్‌ను, అతని సహాయకుడిని కాల్చి చంపాడు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వస్తున్న ఇద్దరు అనుమానితులను ఆపమని పోలీసులు సూచించారు. వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. 19 ఏళ్ల దీపక్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో నిందితుడు తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Punjab Encounter | ఉగ్ర సంబంధాలపై ఆరా..

ఏఎస్సై హత్యకు ఉపయోగించిన 30 బోర్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, ఎనిమిది తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంబంధంపై కూడా ఆరా తీసుస్తున్నారు. చెందిన ఒక ఉగ్రవాది నిందితుడికి డబ్బు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీపక్ గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.

దీనిని కూడా చదవండి : Jogipet Agriculture Office Fire | సంగారెడ్డిలో భారీ ప్రమాదం.. జోగిపేట ఏడీఏ ఆఫీస్‌లో ఎగసిపడిన మంటలు.. సబ్సిడీ పరికరాలు, ఫైళ్లు దగ్ధం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *