India Women Final | బంగ్లాదేశ్​పై ఘన విజయం.. ఫైనల్​కు చేరిన భారత మహిళల జట్టు

ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించి, ఫైనల్​కు చేరింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Women Final | ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత మహిళల జట్టు (India Women Final) ఘన విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్​లో భాగంగా బంగ్లాతో తలపడిన భారత్​ గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లింది.

జపాన్​ (Japan)లోని కరొగి స్పోర్ట్స్​ పార్కులో జరగుతున్న మ్యాచ్​లో భారత్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. ఆది నుంచి భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ చెలరేగిపోయారు. మందాన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా.. 49 బంతుల్లో అజేయంగా 100 రన్స్​ చేసింది. ఇందులో 3 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. హర్మన్​ ప్రీత్​ కౌర్​ 33 బంతుల్లో 40 పరుగుల చేసింది. దీంతో భారత్​ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.

India Women Final | భారత బౌలర్ల విజృంభణ

భారీ లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టంగా బౌలింగ్​ చేస్తూ వరుసగా వికెట్లు తీశారు. దీంతో ఆది నుంచి ఆ జట్టు కష్టాల్లో పడింది. 4 పరుగులకే తొలి వికెట్​ కోల్పోయిన జట్టు ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత​ బౌలర్​ నందిని శర్మ, దీప్తి శర్మ చెరో 3  వికెట్లు తీశారు. దీంతో బంగ్లాదేశ్​ మహిళల జట్టు 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్​  అయింది. 114 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్​లో పాకిస్థాన్​పై శ్రీలంక విజయం సాధించి, పైనల్​కు చేరింది. దీంతో ఫైనల్​లో భారత్​ శ్రీలంకతో తలపడనుంది.

దీనిని కూడా చదవండి : Asian Games | ఆసియా క్రీడలు.. షూటింగ్​లో భారత్​కు రెండు రజతాలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *