CCTV Cameras for Safety | ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం : ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: CCTV Cameras for Safety | గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి (ACP Venkateshwar Reddy) సూచించారు. మన ఊరు–మన భద్రత–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆలూర్( Alur Village) గ్రామంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

CCTV Cameras for Safety | నేరాల నియంత్రణ కోసం..

ఏసీపీ (Armoor Police) మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని ఏసీపీ తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌ వినియోగం, అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ ముక్కెర విజయ్, వీడీసీ అధ్యక్షుడు మగ్గిడి సూర్య రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజలింగం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: రియాద్ ఎయిర్​పోర్టు సమీపంలో భారీ పేలుడు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *