lift accident | లిఫ్ట్​లో ఇరుక్కున్న వ్యక్తి.. కాపాడిన హైడ్రా

మూసాపేటలో ఓ వ్యక్తి లిఫ్ట్​లో ఇరుక్కోగా హైడ్రా సిబ్బంది కాపాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : lift accident | ఓ వ్యక్తి లిఫ్ట్​లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. తాను దిగేలోపే లిఫ్ట్​ కదలడంతో గోడకు, లిఫ్ట్​కు మధ్య చిక్కుకుపోయాడు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని మూసాపేటలో ఆదివారం చోటు చేసుకుంది.

మూసాపేట‌ ఆంజ‌నేయ‌న‌గ‌ర్‌లోని 3 అంత‌స్తుల భ‌వ‌నంలో గ్రిల్స్​తో పాత లిఫ్ట్​ ఉంది. మురళి (40) అనే వ్యక్తి అందులో ఎక్కి రెండో అంతస్తులో దిగడానికి యత్నించాడు. అయితే సెన్సార్లు సక్రమంగా పని చేయకపోవడంతో ఆ వ్య‌క్తి.. బ‌య‌ట‌కు వ‌చ్చేలోపే లిఫ్ట్ పైకి వెళ్లింది. దీంతో ఆయన లిఫ్ట్​లో ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. హైడ్రా సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

lift accident | గంటన్నర పాటు శ్రమించి..

గ్రిల్స్‌లో కాలు ఇరుక్కొని వేళాడుతున్న ముర‌ళిని దాదాపు గంట‌న్న‌ర పాటు శ్రమించి హైడ్రా (Hydraa) సిబ్బంది బయటకు తీశారు. అతడిని రక్షించేందుకు లిఫ్ట్ గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టారు. అధికారులు మాట్లాడుతూ.. మురళి తన భార్యతో కలిసి లిఫ్ట్​ ఎక్కాడని చెప్పారు. రెండో అంతస్తులో దిగే సమయంలో ఒక కాలు బయట పెట్టగానే.. థర్డ్​ ఫ్లోర్​ వేరే వాళ్లు లిఫ్ట్​ బటన్​ నొక్కడంతో అది పైకి వెళ్లింది. ముర‌ళి కాలు ఒక‌టి లిఫ్ట్‌లో – మ‌రొక‌టి రెండో అంతస్తులో ఉండిపోయింది. గ్రిల్స్​ అతడు చిక్కుకోవడంతో ఆయన భార్య కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. హైడ్రా సిబ్బంది ఆయనను కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఫ్యాక్చర్​ అయిందని వైద్యులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Harish Rao | భూ కబ్జాలపై విచారణకు దమ్ముందా?.. రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *