అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games Shooting | జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు 5 పతకాలు గెలుచుకున్నారు.
ఆసియా గేమ్స్ (Asian Games) తొలిరోజు 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం, వ్యక్తిగత ప్రదర్శనలో భారత్ రెండు రజత పతాకాలు గెలుచుకుంది. అలాగే పురుషుల టీం విభాగంలో హిమాన్షు ధిల్లాన్, రుద్రాంక్ష్ పాటిల్ జోడీ సిల్వర్ అందుకుంది. సోమవారం వ్యక్తిగత విభాగాల్లో వీరు ఇద్దరు పతకాలు గెలుచోవడం గమనార్హం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఒక పతకం వచ్చింది. దీంతో భారత ఖాతాలో నాలుగు రజత, రెండు కాంస్య పతకాలు చేరాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఇండియా పదో స్థానంలో ఉంది.
Asian Games Shooting | మార్షల్ ఆర్ట్స్‌లో
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మహిళల 60 కేజీల విభాగంలో సింగపూర్‌కు చెందిన విక్టోరియా టియోతో జరిగిన సెమీ-ఫైనల్లో సుచికా తరియల్ ఓడిపోయారు. దీంతో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నిర్ణయంఐ భారత బృందం అప్పీల్ చేసింది. భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు పాకిస్తాన్‌ను 3-0 తేడాతో ఓడించి క్వార్టర్-ఫైనల్స్‌కు చేరింది.
ఇది కూడా చదవండి..: Chandrasekharan Reappointment | చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ కీలక ప్రకటన