Kisan Morcha Cycle Yatra | రైతు హామీల అమలు కోసం కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర..

రైతు హామీల అమలు కోసం కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Kisan Morcha Cycle Yatra | రైతు హామీల అమలు కోసం కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

Kisan Morcha Cycle Yatra | హామీల అమలులో సర్కారు విఫలం..

ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎంపీ అర్వింద్​ (MP Arvind) ఆదేశాల మేరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీన బోధన్ నుండి ప్రారంభమై, అక్టోబర్ 4వ తేదీన జగిత్యాల వరకు దాదాపు 180 గ్రామాల మీదుగా కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

Kisan Morcha Cycle Yatra | ప్రధాన డిమాండ్లు ఇవే..

రైతులకు షరతులు లేకుండా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని దినేష్​ కులాచారి పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయాలన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ అందించడంతో పాటు, మేనిఫెస్టోలో పేర్కొన్న 10 రకాల పంటలకు బోనస్ చెల్లించాలన్నారు. వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందించాలన్నారు. అలాగే పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్​ చేశారు. నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించాలని.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ (బోధన్), ముత్యంపేట్ చక్కెర కర్మాగారాలను తెరిపించాలన్నారు.

Kisan Morcha Cycle Yatra | పసుపు బోర్డుకు స్థలం ఇవ్వకుండా..

అనంతరం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల ఇందూర్ రైతాంగ కల అయిన జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ మంజూరు చేస్తే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎరువులపై రూ.లక్షల కోట్ల సబ్సిడీ భరిస్తూ, పీఎం-కిసాన్ ద్వారా ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తుందన్నారు. రైతుల హక్కుల సాధనకై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సైకిల్ యాత్రలో రైతులు, సంఖ్యలో కదలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షతన సైకిల్ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. కిసాన్ మోర్చా నాయకులు వెల్మ గంగారెడ్డి, అంతిరెడ్డి హరీష్ రెడ్డి, తోట చిన్నయ్య, జిల్లా పదాధికారులు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ailapur Society Irregularities | ఐలాపూర్​ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *