Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి నిజామాబాద్​ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​క్రైం: Gold Jewellery Murder Case | బంగారు ఆభరణాల కోసం మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా(Nizamabad) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు.

Gold Jewellery Murder Case | నవీపేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

నవీపేట్(Navipet) మండలానికి చెందిన ఆకుల అనంత అలియాస్​ సోనీకి (29) నిందితుడు కుమురం అలియాస్​ పాండవాల సాగర్​ దూరపు చుట్టం. అయితే ఆమె మెడలో బంగారు ఆభరణాలు చూసిన కుమురం వాటిని ఎలాగైనా చోరీ చేయాలని భావించాడు. ఈ క్రమంలో 2025 నవంబర్​ 25వ తేదీన సోనీ తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన నిందితుడు సోని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు.

కేసు నమోదు చేసుకున్ని నవీపేట్​ పోలీసులు విచారణ చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. విచారించిన కోర్టు నిందితుడు కొమురంనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మరో రూ.5వేలు జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో ఆర్నెళ్లు శిక్ష అనుభవించాలని పేర్కొంది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడే విధంగా బలమైన కేసును కోర్టు ముందు నిలబెట్టిన  నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్​ను, ఎఫ్​ఐఆర్​ చేసి కేసును దర్యాప్తు చేసిన నవీపేట్​ ఎస్సై తిరుపతిని సీపీ సాయిచైతన్య అభినందించారు.

ఇది కూడా చదవండి: నిజామాబాద్ ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *