అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 22 Market Analysis | జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా.. గ్లోబల్ మార్కెట్లు(Global markets) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాయి. అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ మరియు ఇతర ఏఐ (AI) దిగ్గజాల లాభాల కారణంగా నాస్డాక్ గత సెషన్లో రికార్డు స్థాయి గరిష్టానికి దూసుకెళ్లింది.
మంగళవారం ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో కొనసాగుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Sep 22 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 2.26 శాతం, ఎస్ అండ్ పీ 1.49 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.14 శాతం నష్టంతో ఉంది.
Sep 22 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.91 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.06 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.74 శాతం లాభంతో ముగిశాయి.
Sep 22 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.70 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.32 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.53 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.40 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.02 శాతం లాభంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.23 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 576 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 29 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 2,797 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి 95.81 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.39 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.96 శాతం వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.03 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.06 నుంచి 1.2 కు పెరిగింది.
- విక్స్ 1.43 శాతం తగ్గి 11.22 వద్ద ఉంది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.