Delhi High Court | ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జిల ముందే అశ్లీల వీడియోల కలకలం!

Shashi kiran Mottala

అక్షరటుడే, న్యూదిల్లీ: Delhi High Court | న్యాయస్థాన విచారణలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా కేసులను విచారిస్తుండగా, ఒక్కసారిగా తెరపై అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమై అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.

Delhi High Court | అసలేం జరిగిందంటే..

ఆన్‌లైన్ వేదికగా విచారణ సాగుతున్న సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు విచారణా ప్రక్రియలోకి చొరబడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ప్రసారాన్ని నిలిపివేసినప్పటికీ, తిరిగి విచారణ మొదలుపెట్టిన ప్రతిసారీ అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. ఇలా మూడు సార్లు జరిగిన తర్వాత, చివరికి తెరపై “మీరు హ్యాక్ అయ్యారు” (You Are Hacked) అనే సందేశం ప్రత్యక్షమైంది. దీంతో చేసేదేమీ లేక అధికారులు వర్చువల్ విచారణను పూర్తిగా రద్దు చేశారు.

Delhi High Court | దర్యాప్తులో తేలిన అంశాలు

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టరు. శ్రీధర్ సర్నోబత్, షిత్‌జీత్ సింగ్ అనే పేర్లతో లాగిన్ అయిన రెండు ఖాతాల ద్వారా ఈ అశ్లీల కంటెంట్ ప్రసారమైనట్లు గుర్తించారు. హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ (High Court Video Conferencing) వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా సైబర్ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సాంకేతిక బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. న్యాయస్థానం వంటి అత్యున్నత వ్యవస్థలో ఇలాంటి ఘటన జరగడం భద్రతాపరమైన లోపాలపై ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: Bengal Polling Controversy | బెంగాల్ ఎన్నికల్లో ‘గుర్తు’ రచ్చ.. రీపోలింగ్‌కు బీజేపీ డిమాండ్!

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *