అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asian Games Final | జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. మంగళవారం శ్రీలంకతో గోల్డ్ మెడల్ కోసం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది.
కరొగి స్పోర్ట్స్ పార్కులో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరోసారి ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందాన (Smriti Mandana) శుభారంభం ఇచ్చారు. ఇద్దరు ఓపెనర్లు ఆది నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. మిగతా ప్లేయర్లు సైతం రాణించడంతో భారత జట్టు 216 పరుగులు చేసింది.
Asian Games Final | చెలరేగిన స్మృతి
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన షెఫాలీ వర్మ ఫైనల్లో సైతం ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 29 బంతుల్లో 48 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. షెఫాలీ ఔట్ అయినా స్మృతి మందాన దూకుడు తగ్గించలేదు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టింది. 45 బంతుల్లో 79 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. చివర్లో రిచా గోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 49 పరుగులు చేసింది.
Asian Games Final | రికార్డుల మోత
ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు పలు రికార్డులు సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టీ 20ల్లో అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్‌గా షెఫాలీ వర్మ (863) నిలిచారు. ఆమె తర్వాత సౌత్ ఆఫ్రికా క్రీడాకారిణి లారా 824 పరుగులు ఉన్నారు. మహిళల టీ 20ల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం సాధించిన జోడిగా స్మృతి మందాన– షెఫాలీ వర్మ నిలిచారు. అన్ని వికెట్లకు కలిపి వీరు ఇప్పటి వరకు 4000 పరుగులు భాగస్వామ్యం చేశారు. వీరి తర్వాత యూఏఈ ప్లేయర్లు ఈశా ఓజా, తీర్థ సతీశ్ (2,494) ఉన్నారు.
ఇది కూడా చదవండి..: India Women Final | బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు