India Women Gold Medal | ఆసియా గేమ్స్​ ఫైనల్​లో ఘన విజయం.. భారత్​ ఖాతాలో తొలి పసిడి

ఆసియా గేమ్స్​ ఫైనల్​లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఇండియా ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Women Gold Medal | ఆసియా గేమ్స్​లో జరుగుతున్న టీ 20 ఫైనల్​లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత ఖాతాలో తొలి గోల్డ్​ మెడల్ చేరింది.

కరొగి స్పోర్ట్స్​ పార్కులో మంగళవారం శ్రీలంక జరిగిన మ్యాచ్​లో భారత ప్లేయర్లు సమష్టి ప్రదర్శనతో ఘన విజయం సాధించారు. మొదట బ్యాటర్లు చెలరేగడంతో భారత్​ 216 భారీ స్కోర్​ చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఆది నుంచి ఏ దశలోనే ఆధిపత్యం చూపట్టలేకపోయింది. 18 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు, అనంతరం వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీప్తీ శర్మ 3, షెఫాలీ వర్మ, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో లంక జట్టు 69 పరుగులకే ఆలౌట్​ అయింది. 147 పరుగుల తేడాతో భారత్​ (India) విజయం సాధించింది.ఈ గెలుపుతో ఆసియా గేమ్స్​లో భారత్ తొలి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 4 సిల్వర్​, రెండు కాంస్య పతకాలు వచ్చాయి. భారత్​ ఖాతాలో మొత్తం 7 పతకాలు చేరాయి. క్రికెట్​లో భారత్​ గోల్డ్, శ్రీలంక సిల్వర్​ మెడళ్లు గెలుచుకోగా.. పాకిస్తాన్​ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

India Women Gold Medal | చెలరేగిన స్మృతి

భారత ఓపెనర్లు లంక బౌలర్లపై విరుచుకపడ్డారు. షెఫాలి వర్మ 29 బంతుల్లో 48 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లు, 3 సిక్స్​లు ఉన్నాయి. షెఫాలీ ఔట్​ అయినా స్మృతి మందాన దూకుడు తగ్గించలేదు. భారీ షాట్లతో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టింది. 45 బంతుల్లో 79 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. చివర్లో రిచా గోష్​ మెరుపు ఇన్నింగ్స్​ ఆడింది. 22 బంతుల్లో 49 పరుగులు చేసింది.

ఇది కూడా చదవండి..: Asian Games Final | పసిడి పోరు.. భారత మహిళల జట్టు భారీ స్కోర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *