అక్షరటుడే, వెబ్‌డెస్క్: Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంద వెంకట కామేష్ అలియాస్ కార్తీక్‌రెడ్డి అనే వ్యక్తి బీటెక్ చదివాడు. తను ఎన్ఆర్ఐని అని అతడు మ్యాట్రీమోని సైట్లలో నమోదు చేసుకునేవాడు. అనంతరం మహిళలకు దగ్గరై పెళ్లి పేరిట మోసాలకు పాల్పడే వాడు. పెళ్లి చేనసుకుంటానని చెప్పి వారిని నమ్మించేవాడు. అనంతరం తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని వారికి చెప్పి డబ్బులు తీసుకొని పరారు అయ్యేవాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
Marriage Fraud PD Act | ఆన్లైన్ బెట్టింగ్ కోసం..
మంద వెంకట కామేష్ 2021 నుంచి 19 మోసాలకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటూ, నకిలీ గుర్తింపుతో అతడు మహిళలను నమ్మించేవాడు. అంతేగాకుండా వారి క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంక్ వివరాలు తెలుసుకొని వాటిని అనధికార లావాదేవీలు, ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు. మరిన్ని మోసాలకు పాల్పడకుండా తాజాగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. అనంతరం చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి..: Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్ రైళ్లు