Municipal Workers Strike | మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..: అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్: Municipal Workers Strike | మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala) డిమాండ్ చేశారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్మికులు ధర్నా చౌక్​లో చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు.

Municipal Workers Strike | ఎల్లప్పుడూ అండగా ఉంటా..

కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, లైన్‌మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, వాటర్ సెక్షన్ సిబ్బంది గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ స్పందించకపోవడం విచారకరమన్నారు. మున్సిపల్ కార్మికులు తన కుటుంబ సభ్యులతో సమానమని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 52ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.19,500 వేతనాన్ని పెంచి, కనీస వేతనంగా రూ.26,000 అందించాలని కోరారు.

Municipal Workers Strike | ప్రతినెలా ఒకటో తేదీన..

ప్రతి నెలా 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, రాత్రి వేళల్లో విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఐడెంటిటీ కార్డులు (ID Cards) మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియల కోసం రూ.20,000 తక్షణ సాయం అందించాలని, అలాగే మృతుల కుటుంబ సభ్యులకు (వయోపరిమితి సడలించి) ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి ఉత్సవాల వేళ వీధిదీపాలు వెలగక నగరం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని, దీనివల్ల ప్రజలకు మరియు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని గుర్తుచేశారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో సేవలు అందించిన మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం దయతో వ్యవహరించాలని, కార్మికుల సమ్మె వల్ల నగరంలో పారిశుధ్యం, విద్యుత్ దీపాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా NUDA ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతిన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Building Demolition | అనుమతి లేకుంటే భవనాలు కూల్చివేస్తాం: మున్సిపల్ కమిషనర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *