అక్షరటుడే వెబ్‌డెస్క్: BIS Screen Protectors | స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రత, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్లో విక్రయించే మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
BIS Screen Protectors | కంపల్సరీ రిజిస్ట్రేషన్ ..
ఇప్పటి వరకు వివిధ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు మాత్రమే పరిమితమైన కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆర్డర్ (CRO) నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఈ కఠినమైన నాణ్యతా ప్రమాణాల పరిధిలోకి తాజాగా స్క్రీన్ ప్రొటెక్టర్లను కూడా చేర్చింది. కేంద్రం వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం, స్క్రీన్ ప్రొటెక్టర్లకు సంబంధించిన బీఐఎస్ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా పూర్తిగా అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి మార్కెట్లో విక్రయించే ప్రతి స్క్రీన్ ప్రొటెక్టర్ తగిన బీఐఎస్ ధ్రువీకరణను కలిగి ఉండటం తప్పనిసరి కానుంది.
BIS Screen Protectors | కలిగే ప్రయోజనాలు..
మార్కెట్లో లభించే నాణ్యత లేని లోయర్-క్వాలిటీ స్క్రీన్ ప్రొటెక్టర్ల వాడకం వల్ల స్మార్ట్‌ఫోన్ టచ్ సెన్సిటివిటీ దెబ్బతినడం, కంటిపై ప్రతికూల ప్రభావం పడటం, డిస్ప్లేలు త్వరగా పాడైపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే మార్కెట్లో కేవలం నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని, తద్వారా వినియోగదారులకు రక్షణ లభిస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Railway Station | కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం