అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Red Cross Election Nomination | రెడ్‌క్రాస్ ఎన్నికల (Red Cross Election) నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
Red Cross Election Nomination | ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్టుకు..
అక్టోబర్ 4వ తేదీన జరగనున్న నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేసేందుకు న్యాయవాది మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ముందుకొచ్చారు. గురువారం రెడ్‌క్రాస్ జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవలను జిల్లాలో ఇంకా మరింత పటిష్టం చేయడం కోసం కృషి చేస్తానన్నారు. సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా రక్తాన్ని అందించే విధంగా.. జిల్లాలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు శాయాశక్తులా కృషి చేస్తానన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు నిరంతరం సమీక్షిస్తున్న ఏపీ సీఎం