Nizamabad Ganesh Shobhayatra | ఇందూరులో మరికొన్ని గంటల్లో గణేష్​ శోభాయాత్ర ప్రారంభం..

నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ganesh Shobhayatra | నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది.. ‘గణపతి బప్పా మోరియా.. ఆగలే వర్స్​ తుమ్​ జల్దీ ఆ..‘ అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికే ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

 Nizamabad Ganesh Shobhayatra | భక్తిశ్రద్ధలతో..

తొమ్మిదిరోజుల పాటు ఇళ్లలో, మండపాల్లో దూపదీప నైవేద్యాలతో విశేష పూజలందుకున్న లంబోదరుడిని సాగనంపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు తమతోనే ఉన్న గణపయ్య తమను వీడి వెళ్తున్నందుకు భక్తులు భావోద్వేగానికి లోనవుతారు. అంతలా గణనాథుడు భక్తుల్లో లీనమై ఉంటాడు.

 Nizamabad Ganesh Shobhayatra | మధ్యాహ్నం రథయాత్ర ప్రారంభం..

Nizamabad Ganesh Shobhayatra

ఇందూరు (Nizamabad) పట్టణంలో గణేష్​ నిమజ్జన శోభాయాత్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. పట్టిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య.. సార్వజనిక్​ గణేష్​ మండలి ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ రథాన్ని ఎడ్లు లాగుతుంటాయి. అలాగే భక్తులు సైతం రథాన్ని లాగి తమ మొక్కులు తీర్చుకుంటారు. మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభ ప్రాంతం నుంచి గణపతుల బావి వరకు పారిశుధ్య ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. దుబ్బ ప్రాంతంలో ప్రారంభమయ్యే రథయాత్ర రైల్వేకమాన్​, గంజ్​ మార్కెట్​ మీదుగా బోధన్​ బస్టాండ్​ మీదుగా సాగుతుంది. గురుద్వార్​, లక్ష్మీ మెడికల్​ చౌరస్తా నుంచి గోల్​హనుమాన్​ చౌరస్తా నుంచి వినాయకుల బావికి చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది.

 Nizamabad Ganesh Shobhayatra | 1300మందికి పైగా పోలీసు సిబ్బంది..

Nizamabad Ganesh Shobhayatra

 

ఈ ఏడాది సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దుబ్బలో రథయాత్ర ప్రారంభం నుంచి వినాయక్​నగర్​లో గణపతుల బావి వద్ద ముగింపు వరకు అడుగడుగునా పోలీసులను ఇప్పటికే మోహరించింది. 1300మందికి పైగా పోలీసు సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొన్నారు. పోలీస్​ కమిషనరేట్​లో కొంతమంది పోలీసులు హైదరాబాద్​ గణేష్​ శోభాయాత్రకు తరలినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి  పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

123123

ఇది కూడా చదవండి..: Banswada Journalist Training | బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణకు జోరుగా ఏర్పాట్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *