అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balapur Laddu Auction 2026 | ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట ఈ సంవత్సరం కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్రారంభమైన నాటి నుంచి ఏటా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ బాలాపూర్ (Balapur) లడ్డూ దూసుకుపోతోంది. 1994లో కేవలం రూ.450తో మొదలైన ఈ వేలం పాట, అంచెలంచెలుగా పెరిగి నేడు దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ లడ్డూను దక్కించుకుంటే అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తాయన్న భక్తుల ప్రగాఢ విశ్వాసమే ఇక్కడ ఇంతటి భారీ పోటీకి ప్రధాన కారణం.
Balapur Laddu Auction 2026 | 2026లో సరికొత్త చరిత్ర..
ఈ సంవత్సరం (2026) జరిగిన హోరాహోరీ వేలం పాటలో సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సామ ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం (2025లో) లింగాల దశరథ్ గౌడ్ రూ. 35 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకోగా, ఈసారి ఆ రికార్డును రూ. 4 లక్షల ఆధిక్యంతో ప్రణీత్ రెడ్డి అధిగమించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ వేలం పాట ముగిసిన తర్వాత, గణనాథుడు నిమజ్జనానికి ఘనంగా తరలివెళ్లాడు.
Balapur Laddu Auction 2026 | వేలం పాట ప్రస్థానం (1994 – 2026)..
సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ బాలాపూర్ లడ్డూ క్రేజ్ , దాని ధర భారీగా పెరుగుతూ వస్తోంది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు లడ్డూను దక్కించుకున్న ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.
1994: కోలన్ మోహన్ రెడ్డి – రూ. 450
1995: కోలన్ మోహన్ రెడ్డి – రూ. 450
1996: కోలన్ కృష్ణారెడ్డి – రూ. 18,000
1997: కోలన్ కృష్ణారెడ్డి – రూ. 28,000
1998: కోలన్ మోహన్ రెడ్డి – రూ. 51,000
1999: కళ్లెం అంజిరెడ్డి – రూ. 65,000
2000: కళ్లెం ప్రతాప్ రెడ్డి – రూ. 66,000
2001: గొండోజి రఘునందన చారి – రూ. 85,000
2002: కందాడ మాధవరెడ్డి – రూ. 1,05,000
2003: చిగురింత బాల్ రెడ్డి – రూ. 1,55,000
2004: కోలన్ మోహన్ రెడ్డి – రూ. 2,01,000
2005: ఇబ్రహీం శేఖర్ – రూ. 2,08,000
2006: చిగురింత తిరుపతి రెడ్డి – రూ. 3,00,000
2007: గుండోజి రఘు నందన చారి – రూ. 4,15,000
2008: కోలన్ మోహన్ రెడ్డి – రూ. 5,07,000
2009: సరిత – రూ. 5,10,000
2010: కోడాలి శ్రీధర్ బాబు – రూ. 5,35,000
2011: కోలన్ బ్రదర్స్ – రూ. 5,45,000
2012: పన్నాల గోవర్ధన్ రెడ్డి – రూ. 7,50,000
2013: తీగల కృష్ణారెడ్డి – రూ. 9,26,000
2014: సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ. 9,50,000
2015: కళ్లెం మదనమోహన్ రెడ్డి – రూ. 10,32,000
2016: కందాడి స్కైలాబ్ రెడ్డి – రూ. 14,65,000
2017: నాగం తిరుపతిరెడ్డి – రూ. 15,60,000
2018: తెరటి పల్లి శ్రీనివాస్ గుప్త – రూ. 16,60,000
2019: కోలన్ రామిరెడ్డి – రూ. 17,60,000
2020: కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు
2021: రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి – రూ. 18,90,000
2022: ఒంగేటి లక్ష్మారెడ్డి – రూ. 24,60,000
2023: దాసరి దయానంద రెడ్డి – రూ. 27,00,000
2024: కోలన్ శంకర్ రెడ్డి – రూ. 30,01,000
2025: లింగాల దశరథ గౌడ్ – రూ. 35,00,000
2026: అర్బన్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ సామ ప్రణీత్ రెడ్డి – రూ. 39,00,000
రూ. 39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ లడ్డూ వేలం పూర్తయింది. వేలంలో రికార్డు ధర పలికింది. రూ. 39 లక్షలకు అర్బన్ గ్రూప్ అధినేత సామా ప్రణిత్ రెడ్డి దక్కించుకున్నారు.
#balapurladdu #ganeshchaturthi #ladduauction #hyderabad #aksharatoday https://t.co/Pnzr1VKV86
— Akshara Today | Telugu News (@AksharaToday) September 25, 2026
ఇది కూడా చదవండి..: Khairatabad Ganesh Immersion | ఖైరతాబాద్‌లో తీవ్ర విషాదం.. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో యువకుడు దుర్మరణం